Header Ads Widget

Understanding about the Servo Motors and Servo Motor Arduino program in Telugu

 ఫ్రెండ్స్  ఈ ఆర్టికల్లో మనం Servo Motor గురించి మరియు Servo Motorకి Arduino program ఎలా రాయాలో తెలుసుకోబోతున్నాము . ముందు గా Servo Motor అంటే ఏమిటో తెలుసుకొందాము . కింద ఫోటో లో ఉంది చూసారా అదే Servo Motor . దీనికి  మొత్తం 3 పిన్స్ లేదా wires  ఉంటాయి . ఈ  Servo Motor  అనేది 0 to  180 degrees  మాత్రమే  తిరగగలదు. 

meworkstelugu servomotor tutorial

Servo Motor pins description:

మొదటి wire (yellow or orange color wire ) వచ్చేసరికి  read wire అంటే ఈ వైర్ arduino నుంచి వచ్చిన డాటాను రీడ్ చేసుకొంటుంది 

రెండవ  wire (red color wire ) వచ్చేసరికి  vcc వైర్  ఇది Servo Motor కి పవర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది 

మూడవ  wire (brown or black color wire ) వచ్చేసరికి  GND వైర్ 

ఇపుడు మనం  Servo Motor యొక్క పిన్స్ అవి ఎందుకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకొనుము . 


How to install Servo Motor library files :

ఈ   Servo Motor కి మనం ప్రోగ్రాం రాయాలి అంటే మన Arduino  software లో Servo Motor  యొక్క library ఫైల్  నీ ఇన్స్టాల్ (install ) చేసుకొని ఉండాలి .  

ఇపుడు Servo Motor  యొక్క library ఫైల్  నీ మన Arduino  software లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకొందాము . 

 Arduino  software లో Sketch  మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని options  నీ చూపిస్తుంది అందులో  include library  మీద క్లిక్  చేస్తే  మళ్ళి  మనకు కొన్ని library  files  కనిపిస్తాయి అందులో  manage library  మీద  క్లిక్ చేస్తే వేరే window  ఒకటి open  అవుతుంది ఇపుడు ఆ window  యొక్క search bar లో Servo  అని   search  చేస్తే మనకి Servo Motor  యొక్క  library ఫైల్ కనిపిస్తుంది  పక్కనే install అనే ఆప్షన్ కనిపిస్తుంది  దానిమీద క్లిక్  చేస్తే  Servo Motor  యొక్క  library ఫైల్ Arduino  software లో install అవుతుంది.   ఈ విధముగా  మనకి కావలసిన library ఫైల్ Arduino  software లో install   చేసుకోవచ్చు . 

ఈ  Servo Motor యొక్క library ఫైల్  నీ మన Arduino  software లో తీసుకురావడానికి  #include<Servo.h> అనే  command  నీ ఉపయోగిస్తాము . కింద ప్రోగ్రాం చుస్తే మీకు మరింత  బాగా అర్ధం అవుతుంది . 

Simple Servomotor  Run Program :

#include<Servo.h>

int servopin=7;
int servopos =0;
Servo myservo;
void setup() {
  // put your setup code here, to run once:
Serial.begin(9600);
myservo.attach(servopin);

}

void loop() {
  // put your main code here, to run repeatedly:
myservo.write(servopos);

}




పైన  ప్రోగ్రాం లో  మనం int servopin=7;  తీసుకొన్నాం ఇక్కడ servo motor  యొక్క read pin  నీ Arduino లో 7 పిన్ కి కనెక్ట్  చేసాము అని అర్థము . 

int servopos =0;  ఇక్కడా  servopos  అంటే Servo Motor యొక్క position  అని అర్ధం Servo Motor
 0 to  180 degrees తిరుగుతుంది కాబట్టి మనకి కావలసిన  position కి తీసుకురావడానికి ఈ varible ఉపయోగిస్తాము . 

Servo myservo; ఇక్కడా Servo అనేది  ఒక  keyword  ఇది Arduinoకి  Servo Motor  మధ్య  వారధి (bridze ) లా పనిచేస్తుంది. myservo అనేది మనం  Servo Motorకి పెట్టుకొన్న పేరు . ఈ పేరు ఏది అయినా పెట్టుకోవచ్చు Arduino యొక్క keywords తప్ప . 

 myservo.attach(servopin); ఇక్కడ  . myservo  అనేది Arduino లో 7పిన్ కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి  myservo.attach(servopin); అనే keyword ఉపయోగిస్తున్నం . 

myservo.write(servopos);  అనేది   Arduino  లో నుంచి వచ్చిన డేటానీ  రీడ్ చేసుకోడానికి ఉపయోగపడుతుంది . 




Servomotor  Run  0 to 180 Degress Contionously Program :

#include<Servo.h>

int servopin=7;
int servopos =0;
Servo myservo;
void setup() {
  // put your setup code here, to run once:
Serial.begin(9600);
myservo.attach(servopin);

}

void loop() {
  // put your main code here, to run repeatedly:
for( servopos =0; servopos <=180;servopos++)
{
 myservo.write(servopos);
}
for( servopos =180; servopos  =>0 ;servopos++)
{
 myservo.write(servopos);
}

}

మరిన్ని వివరాలకోసం  క్రింద  ఉన్న వీడియో చుడండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ బాక్స్ లో  చెప్పండి . 




Post a Comment

0 Comments